యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ప్రస్తుతం అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగులో యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తీస్తున్న కింగ్డమ్ మూవీతో పాటు తమిళ్ లో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలు కూడా అనిరుద్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ రెండు సినిమాల గురించి ఒక ఇంటర్వ్యూలో భాగంగా అనిరుద్ మాట్లాడుతూ, తాను ఒక 40 నిమిషాల మేర కింగ్డమ్ మొవేయి చూశానని, ఎంతో బాగా వచ్చిందని అన్నారు. అలానే రజినీకాంత్ కూలీ కూడా చాలావరకు చూశానని అది కూడా ఎంతో బాగా వస్తోందని తెలిపారు.
తనకు ఇష్టమైన సూపర్ స్టార్ తో వరుసగా ఒకేసారి రెండు సినిమాలు జైలర్ 2, కూలీ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆగష్టు 14న రానున్న కూలీ తప్పకుండా పెద్ద సక్సెస్ ఖాయం అని తెలిపారు. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ ద్వారా ఆయనతో కలిసి ఫస్ట్ టైం పని చేస్తుండడం హ్యాపీగా ఉందని అన్నారు.
అయితే తాను కంపోజ్ చేసే పలు సినిమాల రిలీజ్ ల సమయంలో తన ట్విట్టర్ ద్వారా వాటి రిలీజ్ రోజున సక్సెస్ కి చిహ్నంగా ఎమోజిలు పోస్ట్ చేస్తుంటారు అనిరుద్. అయితే ఈ రెండు సినిమాల విషయమై అవి పోస్ట్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదని, మొత్తంగా రెండు సినిమాల సక్సెస్ పై ముందే ఈ విధంగా తన అభిప్రాయాన్ని తెల్పుతున్నాని అన్నారు అనిరుద్. మరి ఈ రెండు సినిమాల విషయమై అనిరుద్ జోస్యం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.