Home సినిమా వార్తలు ‘వార్ 1’ స్థాయిలో ఆకట్టుకోని ‘వార్ 2’ టీజర్

‘వార్ 1’ స్థాయిలో ఆకట్టుకోని ‘వార్ 2’ టీజర్

war 2 teaser

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యక్షన్ సినిమా వార్ 2. ఈ మూవీపై భారతీయ ఆడియన్స్ అందరిలో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి.

యష్ రాజ్ ఫిలింస్ సంస్థపై ఆదిత్య చోప్రా భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని మొన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ చాలా వరకు మిక్స్డ్ రెస్పాన్స్ అయితే అందుకుంటుంది.

ముఖ్యంగా ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన వార్ 1 మూవీ పెద్ద విజయం అందుకోవటంతో పాటు దాని యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని దీనిత్ పలువురు ఆడియన్స్ కంపేర్ చేస్తున్నారు. వార్ 1 టీజర్ లో ఫేస్ ఆఫ్ సన్నివేశాలతో పాటు అటు హృతిక్ ఇటు టైగర్ ష్రాఫ్ లకు సంబంధించిన సీన్స్ ని కూడా అద్భుతంగా చూపించారని అలానే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి కూడా అదిరిపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే విజవాల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తాజాగా వాట్ 2 టీజర్ లో బాలేదని పలువురు పెదవి విరుస్తున్నారు. ఆ విధంగా రెండు టీజర్ల కంపేర్ చేస్తున్న నెటిజెన్స్ వార్ 1 టీజర్ బాగుందని ఫైనల్ గా చెప్తున్నారు. మరి ఆగస్టు 14న అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన వార్ 2 మూవీ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version