టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ ల కలయికలో కియారా అద్వానీ హీరోయిన్ గ ప్రస్తుతం యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న మూవీ వార్ 2. సరిగ్గా ఆరేళ్ళ క్రితం ఆడియన్స్ ,ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న వార్ మూవీకి ఇది సీక్వెల్ అనేది తెలిసిందే.
ఇక ఈ మూవీని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ఆశుతోష్ రానా, అనిల్ కపూర్ నటిస్తున్నారు. అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈమూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీమ్ రిలీజ్ చేసింది.
టీజర్ లో ఎన్టీఆర్ లుక్స్, స్టయిల్, డైలాగ్స్, యాక్షన్ అదిరిపోయాయి. అలానే హృతిక్ కూడా కబీర్ గా తన స్టైలింగ్ తో అదరగొట్టాడు. కబీర్ ని ఛాలెంజ్ చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఇది ప్రారంభం అవుతుంది. అయితే టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేవు, అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తేలిపోయింది.
హీరోస్ ఇద్దరి లుక్స్ బాగున్నా మిగతా అంశాలు ఏవి కూడా టీజర్ లో అంతగా ఇంట్రెస్టింగ్ గా లేవు. మరి ఆగష్టు 14న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ ఎంత మేర ఆడియన్స్, ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.