Home సినిమా వార్తలు మెగాస్టార్ మూవీలో వెంకటేష్ రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

మెగాస్టార్ మూవీలో వెంకటేష్ రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

chirnajeevi venkatesh

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం విశ్వంభర సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమాలో భీమవరం దొరబాబుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా ఆయన సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏడాదిలో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు త్వరలో అనిల్ రావిపూడి సినిమా యొక్క సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు.

నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మెగా మార్క్ యాక్షన్ అంశాలతో పాటు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో దర్శకుడు అనిల్ రావిపూడి దీని యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

అయితే అసలు విషయం ఏమిటంటే విక్టరీ వెంకటేష్ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారని ఆ పాత్ర ఓవరాల్ గా సినిమాలో 15 నుంచి 20 నిమిషాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

అలానే ఆ సీన్స్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ రావటం ఖాయమని చెప్తున్నారు. ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సాహు గారపాటితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version