Home సినిమా వార్తలు Waltair Veerayya: వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ మరియు బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ అన్న చిరంజీవి

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ మరియు బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ అన్న చిరంజీవి

వాల్తేరు వీరయ్య చిత్ర బృందం నిన్న ప్రెస్ మీట్ నిర్వహించింది. కాగా ఈ చిత్రం యొక్క కంటెంట్ మరియు దాని విజయం పై చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉంది. ఇక సినిమా హీరో అయిన చిరంజీవి తాను సినిమా చూశానని, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

వాల్తేరు వీరయ్య తన కెరీర్‌లో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని మరియు శంకర్ దాదా MBBS తర్వాత.. తను వాల్తేరు వీరయ్యలో అంత కామెడీ చేసానని చిరంజీవి అన్నారు.

Megastar Chiranjeevi Speech at Waltair Veerayya Press Meet

మెగాస్టార్ చిరంజీవి ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లోనూ కృత్రిమత్వం కాకుండా కొంత సహజత్వం ఉంటుందట. దర్శకుడు బాబీ కొల్లి అద్భుతమైన కాన్సెప్ట్‌తో తన వద్దకు వచ్చినందుకు మరియు సినిమాలో తనని కొత్త అవతార్‌లో చూపించినందుకు మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్, రవితేజ తమ పాత్రలను పోషించిన తీరు చిరంజీవి నుంచి ప్రశంసలను అందుకుంది. సినిమాలోని మిగిలిన పాత్రలు కూడా వారి ప్రాతినిధ్యాల ద్వారా సమర్థించబడ్డాయని అతను నొక్కి మరీ చెప్పారు.

మాస్, క్లాస్ మరియు హృద్యం ఇలా అన్ని రకాలుగా పాటలకు న్యాయం చేశారని గీత రచయిత చంద్రబోస్ మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పనిని చిరంజీవి మరింతగా మెచ్చుకున్నారు.

ఈ సినిమాలో తన పాత్రకు శృతిహాసన్ కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందుకున్నారు. చిరంజీవి సరసన శ్రుతి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే శ్రుతి ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు.

ఇక దర్శకుడు బాబీ కూడా సినిమా గురించి, దాని మేకింగ్ గురించి మరియు తన అభిమాన హీరోతో కలిసి పని చేసిన అనుభవం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. దాదాపు 20 నిమిషాలకు పైగా ఆయన ప్రసంగించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version