Home సినిమా వార్తలు Dhamaka: నెగటివ్ రివ్యూలు కమర్షియల్ సినిమా పై ప్రభావం చూపవని మరోసారి రుజువు చేసిన ధమాకా

Dhamaka: నెగటివ్ రివ్యూలు కమర్షియల్ సినిమా పై ప్రభావం చూపవని మరోసారి రుజువు చేసిన ధమాకా

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ధమాకా విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గడిచే ప్రతి రోజు కూడా ఈ చిత్రం నిలకడగా రాణిస్తోంది, ట్రేడ్ సర్కిల్‌లు మరియు సినీ ప్రేక్షకుల రోజువారీ అంచనాలు ఈ సినిమా లాంగ్ రన్‌తో తప్పుగా ఋజువు అవుతున్నాయి.

ధమాకా తొలి రోజు దాదాపు అన్ని వెబ్‌సైట్‌ల నుండి ప్రతికూల సమీక్షలను తెచ్చుకున్న సంగతి తెలిసిందే మరియు విదేశీ ప్రీమియర్‌ల నుండి టాక్ కూడా బాగా రాలేదు. దాంతో ఈ సినిమా వర్కవుట్ అవ్వదని, రవితేజకి మరో డిజాస్టర్ సినిమాగా నిలుస్తుందని అంతా అనుకున్నారు.

అయితే ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే తన బిజినెస్ మొత్తం రికవర్ చేసి రవితేజ కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇదే జోరు కొనసాగిస్తే రవితేజ సినిమాల్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశం కూడా ఉంది.

మాస్‌ ఎలిమెంట్స్‌తో కూడిన కమర్షియల్‌ సినిమాల పై నెగిటివ్‌ రివ్యూల ప్రభావం ఉండదని ధమాకా విజయం మరోసారి రుజువు చేసింది. తాము టార్గెట్ చేసిన మాస్ ప్రేక్షకులకు సినిమా నచ్చితే ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.

గతంలో, సింహా, అఖండ, KGF పార్ట్ వన్ మరియు అత్యంత ప్రశంసలు పొంది ఆస్కార్ రేసులో కూడా దూసుకుపోతున్న పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ RRR వంటి అనేక సినిమాలు కూడా ప్రముఖ వెబ్‌సైట్‌ల నుండి తక్కువ రేటింగ్‌లను పొందాయి.

అయితే ఒక సినిమా విజయానికి కావాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే విడుదలకు ముందు సరైన ప్రమోషన్స్ చేయడం మరియు ప్రేక్షకులలో తగిన అంచనాలు నెలకొల్పడం. సినిమా యూనిట్ ఈ పని చేయగలిగితే ఇంక ఆ సినిమా హిట్ అవడం దాదాపు ఖాయమే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version