మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సోషియా ప్యాంటసి యాక్షన్ సినిమా విశ్వంభర. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర రిలీజ్ నుండి అయిన ఫస్ట్ సాంగ్ రామ రామ బాగానే రెస్పాన్స్ అందుకుంది.
వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇతర వర్కుల పెండింగ్ కారణంగా కొన్నాళ్లుగా వాయిదా పడుతూ కొనసాగుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ మిరాయ్.
ఈ సినిమా వాస్తవానికి ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు, అయితే సినిమా షూటింగ్ తో పాటు ఇతర వర్కుల ఆలస్యం కారణంగా దీన్ని ఆగస్టు 1 కి పోస్ట్ పోన్ చేసినట్టు తాజాగా టీం అయితే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ భాజ్ ప్రకారం ఆ రోజున మెగాస్టార్ విశ్వంభర మూవీ రిలీజ్ కానుందని చెప్తున్నారు.
వాస్తవానికి అదే రోజున తేజ సజ్జ మిరాయ్ రిలీజ్ కూడా ఉండటంతో ఇప్పుడు మెగాస్టార్ విశ్వంభర ప్రకటించడంతో ఆ మూవీ కొన్నాళ్లు వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతోంది.
అయితే ఆ డేట్ పర్ఫెక్ట్ అని సరిగ్గా అక్కడికి రెండు వారాల అనంతరం వార్ 2 మరియు కూలీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో విశ్వంభర టీం కూడా ఆగస్టు 1 నే ఫిక్స్ చేసి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్.
అయితే వాస్తవానికి విశ్వంభర అఫీషియల్ డేట్ ఇప్పటివరకు ఫిక్స్ కాకపోవడానికి కారణం దాని యొక్క ఓటిటి డీల్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే అది కూడా పూర్తి చేసి అఫీషియల్ రిలీజ్ డౌట్ ని అనౌన్స్ చేస్తారట.