Home సినిమా వార్తలు Vishwambhara Teaser Mega feast ‘విశ్వంభర’ : పవర్ఫుల్ మెగా ఫీస్ట్ 

Vishwambhara Teaser Mega feast ‘విశ్వంభర’ : పవర్ఫుల్ మెగా ఫీస్ట్ 

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఇషా చావ్లా, సురభి, ఆశిక రంగనాథ్, మీనాక్షి చౌదరి, కునాల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. 

ఇప్పటికే అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. విషయం ఏమిటంటే, నేడు విజయదశమి పండుగ సందర్భంగా విశ్వంభర మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. 

ముఖ్యంగా టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ ఎంట్రీ తో పాటు గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఎంతో అదిరిపోయాయి. ముఖ్యంగా టీజర్ ని బట్టి చూస్తే ఖచ్చితంగా విశ్వంభర బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకునే అవకాశం కనపడుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని మే 9న గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version