Home సినిమా వార్తలు Devara Enters into 400 Crores Club రూ. 400 కోట్ల క్లబ్ లో ‘దేవర’

Devara Enters into 400 Crores Club రూ. 400 కోట్ల క్లబ్ లో ‘దేవర’

jr ntr

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ గ్రాండ్ గా నిర్మించారు. 

రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలో శ్రీకాంత్, మురళి శర్మ, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో కనిపించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర, వర పాత్రల్లో తన పెర్ఫార్మన్స్ అదరగొట్టారు. సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకి వచ్చిన దేవర పార్ట్ 1 మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుని బాగానే కలెక్షన్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. 

విషయం ఏమిటంటే, నిన్నటితో ఈ మూవీ అఫీషియల్ గా రూ. 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడంతో పాటు నిన్నటితో ప్రభాస్ సాహో మూవీని అధిగమించి టాలీవుడ్ లో ఈ ఫీట్ అందుకున్న ఆల్ టైం టాప్ 6వ మూవీగా నిలిచింది. మరోవైపు ఇంకా పలు సెంటర్స్ లో దేవర బాగానే కలెక్షన్ రాబడుతుండడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version