సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష ఈరోజే విడుదలైంది. చాలా పాజిటివ్ బజ్ తో రిలీజైన ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్స్, ఎర్లీ షోల నుంచి ఆడియన్స్ టాక్ పాజిటివ్ గా ఉంది. టాక్ ప్రకారం సినిమాలో ఫస్ట్ హాఫ్ లోని లవ్ ట్రాక్ కాస్త బోరింగ్ గా ఉందని చాలా మంది ప్రేక్షకులు భావించడంతో సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా ఆసక్తికరంగా మారడం మొదలవుతుంది.
సెకండాఫ్ ఎంగేజింగ్ గా సాగి క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అదే దారిలో నడుస్తుంది. సెకండాఫ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఓవరాల్ గా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి వచ్చిన రివ్యూలు, రెస్పాన్స్ చాలా బాగుందనే చెప్పాలి.
మొత్తంగా టాక్ ప్రకారం విరూపాక్ష హిట్ మూవీ అని, థియేటర్లలో తప్పక చూడాల్సిన సినిమా అని అంటున్నారు. అజనీష్ లోకనాథ్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నటీనటుల అద్భుతమైన నటన సినిమాకు ప్లస్ గా నిలిచాయి అంటున్నారు. కథలో మంచి డీటెయిలింగ్ తో స్ట్రాంగ్ కంటెంట్ ను అందించడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యారని అంటున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల కేవలం తెలుగులోనే విడుదలైంది. బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సునీల్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాకి సుకుమార్ రచనా భాద్యతలు నిర్వర్తించారు.