Home సినిమా వార్తలు ​Vijay 69 Movie Officially Announced విజయ్ 69 అఫీషియల్ అనౌన్స్ మెంట్ 

​Vijay 69 Movie Officially Announced విజయ్ 69 అఫీషియల్ అనౌన్స్ మెంట్ 

vijay 69

కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదలపతి విజయ్ హీరోగా తాజాగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన యాక్షన్ మూవీ ది గోట్. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆకట్టుకోలేకపోగా, తమిళనాడు ఓవర్సీస్ లో మాత్రం దూసుకెళుతోంది. 

విజయ్ రెండు పాత్రల్లో ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ కనబరిచిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఇక దీని అనంతరం తన కెరీర్ లాస్ట్ మూవీ అయిన విజయ్ 69ని నేడు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ మూవీని హెచ్ వినోద్ తెరకెక్కించనుండగా ప్రముఖ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసి అరైవింగ్ సూన్ అంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో మేకర్స్ ప్రకటించారు. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ మూవీ యొక్క షూట్ త్వరలో ప్రారంభం కానుండగా దీనిని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ​మరి విజయ్ కెరీర్ లో ఆఖరి మూవీగా రానున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ ఎంతమేర విజయం అందుకుని ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version