Vettaiyan Poor 2nd Weekend Marks it as a Flop రెండవవారం ఫ్లాప్ దిశగా ‘వేట్టయన్’ 

    vettaiyan

    సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల జైభీమ్ వంటి మెసేజ్ యాక్షన్ మూవీ తీసిన టీజె జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ వేట్టయన్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పర్వాలేదనిపించే టాక్ ని సొంతం చేసుకుంది. 

    లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై సుభాస్కరన్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం సమకూర్చగా ఇతర కీలక పాత్రల్లో రానా దగ్గుబాటి, మంజు వారియర్, ఫహాద్ ఫాసిల్ నటించారు. కాగా మొదటి వారం ఈ మూవీ రూ. 210 కోట్లని కొల్లగొట్టగా రెండవ వారంలో మాత్రం చాలా వరకు చతికలపడింది. ఇక 11 రోజులకు గాను వేట్టయన్ మూవీ రూ. 235 కోట్ల మార్క్ ని చేరుకుంది. 

    దీనితో ఈ మూవీ 70% మార్క్ రికవరీకి చేరుకుంది. అలానే ఇటు తెలుగు వర్షన్ లో ఈ మూవీ 2/3 మూడవ వంతు మాత్రమే రాబట్టి దాదాపుగా ఫ్లాప్ దిశగా కొనసాగుతోంది. కాగా ఇటీవల లాల్ సలాం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఒక ఫ్లాప్ చవిచూసిన సూపర్ స్టార్, ఇప్పుడు వేట్టయన్ తో మరొక పరాజయాన్ని కూడా చవిచూసే పరిస్థితి వచ్చింది. మరి ఓవరాల్ గా ఏ మూవీ ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

    Follow on Google News Follow on Whatsapp




    Show comments
    Exit mobile version