అఖండ నుంచి బాలకృష్ణ తన కెరీర్ బెస్ట్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఆయన బాక్సాఫీస్ స్టామినా నిలకడగా లేకపోయినా.. ఆ ఒక్క సినిమా మొత్తం అన్నీ మార్చేసింది. ఇప్పుడు ఆయన నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి అంకెలే దీనికి పెద్ద నిదర్శనం, మిక్స్ డ్ టాక్ తో ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ బెస్ట్ నంబర్లను అందించింది.
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం 56 కోట్ల షేర్ వసూలు చేసింది. సెకండ్ వీకెండ్ నాటికి ఈ సినిమా బ్రేక్ వెన్ మార్క్ ను అందుకోవడానికి సిద్ధం అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ 74.7 కోట్లు కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 65.04 కోట్లు వసూలు చేసింది.
అంతే కాకుండా వీరసింహారెడ్డి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవనుంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్ ను పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో మిక్స్ చేయగలడు కాబట్టి ఆయన తర్వాతి సినిమా (NBK108) బాలకృష్ణను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్తుంది అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని, ఫన్ పార్ట్స్ తక్కువగా ఉంటాయని సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ పండించడంలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నప్పటికీ బాలయ్యతో సినిమా చేస్తే కాస్త సీరియస్ ఓరియంటేషన్ ఉంటుందనే విషయం అర్థం చేసుకోగలిగిందే.
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మొదటి షెడ్యూల్ గత నెలలోనే పూర్తయింది. వెంకట్ వి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డిజైనర్ రాజీవన్ భారీ సెట్ వేశారు.
బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల నటిస్తుండగా, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ ఫేమ్ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అయిన NBK108 వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.