మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా పలు సక్సెస్ లతో కొనసాగుతున్నారు. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ తీసిన ఎంపురాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి విజయం అందుకున్న మోహన్ లాల్, తాజాగా తుడరమ్ మూవీ ద్వారా మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు.
శోభన ఇందులో ప్రధాన పాత్ర చేయగా తరుణ్ మూర్తి దీనిని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈమూవీ కేవలం మూడు రోజుల్లో రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుని రూ. 100 కోట్ల దిశగా కొనసాగుతోంది. ఓవరాల్ గా ఈమూవీ రూ. 150 కోట్లని దాటేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.
అయితే ఇటీవల వచ్చిన ఎంపురాన్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేసి ఎంతో ప్రమోట్ చేసారు మోహనల్ లాల్ అండ్ ఆ మూవీ టీమ్. అయితే అది మొత్తంగా రూ. 260 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఇక తాజాగా రిలీజ్ అయిన తుడరమ్ మూవీని మలయాళం, తెలుగు భాషల్లో మాత్రమే రిలీజ్ చేసారు. మోలీవుడ్ స్టార్స్ కి తమిళ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది, కానీ ఆ భాషలో రిలీజ్ చేయలేదు.
మరోవైపు తుడరమ్ మూవీకి కేరళలో సైతం స్పెషల్ గా ఈవెంట్స్ చేయడం కానీ ప్రమోషన్స్ చేయడం కానీ లేదు. మొత్తంగా ఇంత మంచి సక్సెస్ అందుకున్న మూవీని మరింతగా అంతటా ప్రమోట్ చేసి ఉంటె ఖచ్చితంగా మేకర్స్ మరింత భారీ స్థాయి ఆదాయాన్ని అందుకునేవారని అంటున్నారు సినీ విశ్లేషకులు.