టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా వరుస సినిమాలతో బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల ప్రశాంత్ నీల్ తో ఆయన చేసిన సలార్, అలానే నాగ అశ్విన్ తో చేసిన కల్కి 2898 ఏడి మూవీస్ రెండూ కూడా పెద్ద విజయం సొంతం చేసుకుని నటుడిగా ప్రభాస్ రేంజ్ ని అలానే మార్కెట్ వాల్యూని మరింతగా పెంచేశాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
అవి మారుతీ తీస్తున్న ది రాజాసాబ్, సందీప్ రెడ్డి వంగా తీయనున్న స్పిరిట్, హను రాఘవపూడి తీస్తున్న మరొక మూవీ. అయితే ఈ మూడు మూవీస్ అనంతరం సలార్ 2, కల్కి 2 కూడా చేయనున్నారు ప్రభాస్. విషయం ఏమిటంటే, రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ది రాజా సాబ్ మూవీ నుండి లేటెస్ట్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ లభించింది.
ఇక తాజాగా ఆ మూవీ యొక్క టీజర్ రిలీజ్ కి సంబంధించి మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చారు. రేపు ది రాజాసాబ్ మీ ముందుకు వస్తున్నారంటూ ఒక పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. దీనిని బట్టి మూవీ యొక్క టీజర్ రేపు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని 2025 ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.