నాచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దసరా పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే.
తాజాగా వీర్దిగారి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ఇటీవల రాగా నేడు మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసారు. ముఖ్యంగా టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్, డైలాగ్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి.
ఇప్పటివరకు పావురాలు, చిలుకల గురించి విన్నారు, కానీ తొలిసారిగా ఒక తన కాకుల జాతి మొత్తాన్ని ఏకం చేసి తిరగబడి పోరాడే వాడి కథ, ఒక **కొడుకు కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ, నా కొడుకు నాయకుడైన కథ. అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో వచ్చే డైలాగ్స్ పవర్ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ లో నాని ఫ్రంట్ లుక్ రివీల్ చేయలేదు, డిఫరెంట్ గా బ్యాక్ సైడ్ నుండి డిఫరెంట్ గా ఉండే లుక్స్ చూపించారు
ఇక టీజర్ లో సెట్టింగ్స్, విజువల్స్ అన్ని చూస్తే ఈసారి నాని, శ్రీకాంత్ ల ది ప్యారడైజ్ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 26 మార్చి 2026న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.