Home సినిమా వార్తలు Thandel Ready for Breakeven మొదటి వారంలో బ్రేకీవెన్ కి సిద్దమైన ‘తండేల్’ 

Thandel Ready for Breakeven మొదటి వారంలో బ్రేకీవెన్ కి సిద్దమైన ‘తండేల్’ 

thandel

యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీ మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చింది. 

దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న తండేల్ మూవీ ప్రస్తుతం చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. మొత్తంగా గడచిన ఐదు రోజుల్లో ఈ మూవీ రూ. 65 కోట్ల గ్రాస్ ని అలానే రూ. 37 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. 

టోటల్ గా ఈ మూవీ యొక్క బ్రేకీవెన్ రూ.40 కోట్లు కాగా, మరొక రెండు రోజుల్లో ఈ మూవీ ఆ ఫీట్ ని అందుకునే అవకాశం గట్టిగా కనపడుతోంది. దీనిని బట్టి మొదటి వారంలోనే తండేల్ బ్రేకీవెన్ అందుకోనున్నదన్నమాట. కాగా ఈ మూవీ చైతన్య కు రూ. 100 కోట్ల గ్రాస్ మూవీ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

సెకండ్ వీక్ కూడా బాగానే రన్ ఉంటె తప్పకుండా ఆ ఫీట్ కూడా చేరుకునే అవకాశం లేకపోలేదు. ఇక ఈ మూవీలో రాజు గా చైతన్య, సత్య గా సాయి పల్లవి ల సూపర్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి ప్రసంశలు లభిస్తున్నాయి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version