శ్రీనివాస్ అవసరాల నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, ఉపేంద్ర నటించిన పాన్ ఇండియా చిత్రం కబ్జా ఈ వీకెండ్ లో థియేటర్లలో విడుదలవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపడం లేదని అర్థం అవుతుంది.
ప్రేక్షకులలో ఈ సినిమాలకి సరైన ఆసక్తి లేకపోవడానికి పరీక్షల సమయంలో విడుదల చేయడం కూడా ఒక కారణమని ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు అంతా రిలీజ్ రోజు నోటి మాట మీదే ఆధారపడి ఉంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే రెండు సినిమాలకు స్ట్రాంగ్ టాక్ అవసరం.
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన PAPA చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ప్రధాన నటుల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా అనిపించింది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.
చంద్రు దర్శకత్వం వహించిన కబ్జా అనే యాక్షన్ డ్రామాలో ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించారు. కిచ్చా సుదీప్, శ్రియ శరణ్, శివ రాజ్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ట్రైలర్ చూశాక కొందరు ప్రేక్షకులు ఈ సినిమా కేజీఎఫ్ సిరీస్ లా ఉందని భావించారు.
ఈ సినిమా విజయం పై నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మంచి టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్లు సాధిస్తాయో లేదో చూడాలి.