యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీని చందూ మొండేటి తెరకెక్కించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీలో నాగచైతన్య, సాయి పల్లవి ల యాక్టింగ్ తో పాటు దర్శకుడు చందూ మొండేటి టేకింగ్, దేవిశ్రీ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి తండేల్ మూవీని సక్సెస్ చేసాయి. ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఇప్పుడు రూ. 85 కోట్ల దగ్గరకు చేరింది.
మరోవైపు ఈమూవీ అటు ఓవర్సీస్ లో ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయడం లేదు. ఇక హిందీ, తమిళ్ లో ప్రమోషన్స్ చేసినప్పటికీ అక్కడ తండేల్ ఫ్లాప్ అయింది. మరోవైపు లేటెస్ట్ గా ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ సూపర్ హిట్ టాక్ తో కొనసాగుతుండడంతో ఈ పరిస్థితుల్లో తండేల్ మూవీ రూ. 100 కోట్ల మార్క్ అందుకోవడం జరగని పని.
అయితే ఈ మూవీ ఫిబ్రవరి 7 కంటే ఫిబ్రవరి 13న విడుదల అయి ఉంటె, వీకెండ్ నాలుగు రోజుల అడ్వాంటేజ్ తో పాటు రెండవ వారం మహాశివరాత్రి సెలవు కూడా కలిసి వచ్చి ఉండేది. మరి ఓవరాల్ గా తండేల్ ఎంతమేర రాబడుతుందో చూడాలి.