Home సినిమా వార్తలు Daaku Maharaaj Trending Top on Netflix నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్...

Daaku Maharaaj Trending Top on Netflix నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న ‘డాకు మహారాజ్’

daaku maharaaj

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తాజాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ బాలకృష్ణ సరసరణ హీరోయిన్ గా నటించగా ఎస్ థమన్ దీనికి సంగీతం అందించారు. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించారు. 

మూడు షేడ్స్ కలిగిన పాత్రలో ఈ మూవీలో అద్భుతంగా నటించి మరొక్కసారి ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఇందులో చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, సచిన్ ఖేడేకర్, మకరంద్ దేశ్ పాండే, ఆడుకాలం నరేన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్ సొంతం చేసుకుంది డాకు మహారాజ్ మూవీ. 

డాకు మహారాజ్ ఓటిటి 

నిన్న ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. తెలుగుతో పాటు పలు పాన్ ఇండియన్ భాషల్లో ఈ మూవీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. విషయం ఏమిటంటే, తాజాగా డాకు మహారాజ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

గతంలో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ కూడా అటు థియేటర్స్ లో అలానే ఇటు ఓటిటి లో కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే డాకు మహారాజ్ కి సంబంధించి ఊర్వశి రౌటేలా సీన్స్ తో పాటు దబిడి దిబిడి సాంగ్ కూడా తీసేయనున్నారు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన ఓటిటి వర్షన్ లో ఎటువంటి కట్స్ లేకుండా రిలీజ్ అయింది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version