ఇటీవల కిల్ మూవీతో బాలీవుడ్లో మంచి విజయం అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్. అయితే ఆయన తదుపరి మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నారని ఆ మూవీ ఒక భారీ మైథలాజికల్ ఎంటర్టైనర్ అని త్వరలో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రానుందనే వార్తలు కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ మీడియా వర్గాల్లో కూడా వైరల్ అయ్యాయి.
ఇటీవల దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు నిఖిల్ మాట్లాడుతూ రామ్ చరణ్ తో నేను మైథలాజికల్ సినిమా చేయనున్నాను అనే వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. అయితే విషయం ఏమిటంటే తాజాగా లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం నిఖిల్ నగేష్ ప్రస్తుతం మన టాలీవుడ్ నటుడైన విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
ఇప్పటికే విజయ్ దేవరకొండ కోసం ఆయన ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్ సిద్ధం చేశారని త్వరలో ఒక మంచి టైం చూసి విజయ్ ని కలిసి ఆ స్టోరీ ఆయనకు వినిపించనున్నారని అనంతరం ఈ క్రేజీ కాంబినేషన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని చెప్తున్నారు. తాజాగా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో కింగ్ డమ్ అనే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ మూవీ హిందీలో కూడా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవ్వనుంది. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే అటు బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ ప్లాన్స్ గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది.