Home సినిమా వార్తలు సూపర్ స్టార్ రజినీకాంత్ కి హై డిమాండ్

సూపర్ స్టార్ రజినీకాంత్ కి హై డిమాండ్

rajinikanth

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన నటించిన వేట్టయాన్ యావరేజ్ గా ఆడింది. ఇక తాజాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా కూలీ. 

ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం కూడా పూర్తి కావవచ్చింది. దీనిని ఆగస్టు 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు మరోవైపు ఇటీవల జైలర్ 2 మూవీ కూడా అనౌన్స్ చేసి ప్రస్తుతం దాని షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు రజనీకాంత్. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. 

అయితే అసలు విషయం ఏమిటంటే నటుడిగా రజినీకాంత్ కి ప్రస్తుతం విరివిగా అవకాశాలు వస్తున్నాయి. ఆయనకు ఏమాత్రం ఖాళీ లేకుండా పలువురు దర్శకనిర్మాతలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారట. ఇటీవల  ఇలయదళపతి విజయ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన లాస్ట్ సినిమా జన నాయగన్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనిని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. 

ఆ తరువాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా ఉండనున్నారు. దానితో దర్శకనిర్మాతలు అందరూ కూడా రజినీతో సినిమాలు చేయాలని భావిస్తున్నారు.  అయితే రజినీకాంత్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనేటువంటి వార్తలు ఇటీవల వచ్చా యి. మరి కూలీ, జైలర్ అనంతరం రజనీకాంత్ పక్కాగా ఎన్ని సినిమాలు చేస్తారు అనంతరం ఎవరికి అవకాశం ఇస్తారనేది తెలియాలంటే మరి కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version