సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ SSMB 29. ఎంతో భారీ వ్యయంతో రూపొందుతోన్న ఈ మూవీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఈమూవీలో మహేష్ బాబు పాత్ర అదిరిపోతుందని అలానే ఓవరాల్ గా మూవీ అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఇన్నర్ వర్గాల టాక్. ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్రలు చేస్తుండగా పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2027 ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. అనంతరం టీమ్ మొత్తం కెన్యా, సౌత్ ఆఫ్రికా, బల్గెరియా, న్యూ జీలాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో చిత్రీకరణ జరుపనున్నారట.
హాలీవుడ్ టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న తమ మూవీ యొక్క షూట్ ని ఎక్కడా కూడా బ్రేకుల్లేకుండా నిర్వహించేందుకు మొదటి నుండి టీమ్ పక్క ప్రణాళిక సిద్ధం చేసిందని అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో ఉండనుండడంతో షూట్ పూర్తి అయిన అనంతవరం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారట.