Home సినిమా వార్తలు SSMB 29 రిలీజ్ డేట్ లాక్ అయిందా ?

SSMB 29 రిలీజ్ డేట్ లాక్ అయిందా ?

ssmb29

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ SSMB 29. ఈ ప్రతిష్టాత్మక మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈమూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తుండగా రాజమౌళి మార్క్ యాక్షన్ అంశాలతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచెర్ గా ఇది తెరకెక్కుతోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ప్రీ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

నవంబర్ లో ఈ మూవీ యొక్క అఫీషియల్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ గ్రాండ్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో పలు భాషల ఆడియన్సు ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ సిద్దమవుతోందట.

వేసవి కాలం ప్రారంభం తో పాటు రెండవ వారంలో పండుగ సెలవులు అలానే సుదీర్ఘమైన గుడ్ ఫ్రైడే వారాంతం కూడా ఉండడంతో ఈ డేట్ ని జక్కన్న లాక్ చేసారని అంటున్నారు. మొత్తంగా SSMB29 రిలీజ్ డేట్ పై టీమ్ నుండి మాత్రం పక్కగా అఫీషియల్ స్టేట్మెంట్ రావాల్సి ఉంది. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version