Homeసినిమా వార్తలుRajamouli: మహేష్ తో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ మూవీ అని కన్ఫర్మ్ చేసిన రాజమౌళి

Rajamouli: మహేష్ తో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ మూవీ అని కన్ఫర్మ్ చేసిన రాజమౌళి

- Advertisement -

ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా (SSMB28) చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్, రాజమౌళి కాంబినేషన్ అంటే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ఘన విజయం తర్వాత ఈ దిగ్గజ దర్శకుడు ఏం చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీ తరహాలో ప్రపంచవ్యాప్తంగా సంచలన స్థాయిలో ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని, ఇందులో హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని రాజమౌళి ఇదివరకే వెల్లడించారు.

ప్రస్తుతం తాను ఈ సినిమా రచనా దశలో ఉన్నానని, పాశ్చాత్య దేశాల్లో ఆర్ఆర్ఆర్ ఘనవిజయం సాధించడానికి ముందే గ్లోబల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నానని రాజమౌళి వెల్లడించారు. దశాబ్ద కాలంగా ఈ ప్రాజెక్ట్ ప్లాన్ లో ఉందని, ఎట్టకేలకు మహేష్ తో ఈ సినిమా మెటీరియలైజ్ కావడం చాలా ఆనందంగా ఉందని రాజమౌళి అన్నారు.

READ  Vaarasudu: వారసుడు ట్రైలర్ తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి పై భారీ ట్రోల్స్

సినిమా పట్ల నిజమైన అభిరుచి ఉన్న, తన గొప్ప విజన్ ను పంచుకునే సరైన వ్యక్తులను ఈ చిత్రంలో భాగం అయ్యేలా ఎంచుకోవడానికి ప్రముఖ టాలెంట్ ఏజెన్సీ CAA (Creative Artists Agency)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు. వారు సరైన వ్యక్తులతో తనను టచ్ లో ఉంచారని తెలిపిన రాజమౌళి.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా దూరంలోనే ఉందని ఆయన అన్నారు. మొత్తానికి ఈ సినిమాకి జరుగుతున్న పరిణామాల పట్ల రాజమౌళి ఖచ్చితంగా సంతోషంగా ఉన్నారని సమాచారం.

Follow on Google News Follow on Whatsapp

READ  పవన్ కళ్యాణ్ రికార్డుని దాటలేకపోయిన సూపర్ స్టార్ రజినీకాంత్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories