Homeసినిమా వార్తలుKabzaa: పాన్ ఇండియా మూవీ కబ్జాకు షాకింగ్ రన్ టైమ్

Kabzaa: పాన్ ఇండియా మూవీ కబ్జాకు షాకింగ్ రన్ టైమ్

- Advertisement -

చిన్న గ్యాప్ తర్వాత కన్నడ చిత్రపరిశ్రమ నుంచి మరో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ‘కబ్జా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించగా, సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంది. మార్చి 17న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై చిత్ర బృందం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

రిచ్ విజువల్స్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నిండిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమా పై అంచలనాను పెంచింది. కానీ ఒక కథను భారీ స్థాయిలో చెప్పాలనుకున్న ఈ సినిమాకు రన్ టైం చాలా తక్కువ అనే చెప్పాలి. సాధారణంగా ఏదైనా పాన్ ఇండియా లేదా భారీ బడ్జెట్ సినిమాలకు రన్ టైం కనీసం 150 నిమిషాలు, కొన్ని పాన్ ఇండియా సినిమాలకు 170 నిమిషాలు – 180 నిమిషాలు ఉంటుంది.

మరో వైపు కబ్జా కేవలం 136 నిమిషాల రన్ టైం మాత్రమే ఉండడం ఈ సినిమాకు మైనస్ గా మారే అవకాశం ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. మరి ఈ వీకెండ్ లో విడుదలై ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటుందో లేదో చూడాలి.

READ  Allu Arjun: తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో పెద్ద డైలమాలో ఉన్న అల్లు అర్జున్

‘కబ్జా’ చిత్రం 1945 బ్రిటీష్ రాజ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎయిర్ఫోర్స్ సైనికుడి కథగా రూపొందింది. మాఫియా ప్రపంచాన్ని శాసించడానికి వచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడి కుమారుడుగా ఉపేంద్ర కనిపించనున్నారు. పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా 2023 మార్చి 17న విడుదల కానున్న ఈ చిత్రం కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒడియా సహా ఏడు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ విక్రమ్ స్క్రీన్ ప్లేను కాపీ కొడుతున్న టాలీవుడ్ దర్శకులు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories