యువ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. యువ అందాల కథానాయికలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి బీమ్స్ సిసిలోరియో సంగీతం అందించుగా దీనిని ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిలీప్ రాజు నిర్మించారు.
ప్రారంభం నాటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చుని మూవీ సంక్రాంతి కనుక ఆడియన్స్ ముందుకు వచ్చి అతిపెద్ద బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసుకుంది. ఇక ఈ మూవీ అతి త్వరలో ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ ఫిబ్రవరి 20న ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ5 లో పలు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. మొత్తం ఓవరాల్ గా ఇది ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి.