Home సినిమా వార్తలు Shaakuntalam: ప్రతికూల స్పందన తెచ్చుకుంటున్న సమంత నటించిన భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం క్యారెక్టర్...

Shaakuntalam: ప్రతికూల స్పందన తెచ్చుకుంటున్న సమంత నటించిన భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం క్యారెక్టర్ పోస్టర్‌లు

సమంత నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే. కథానాయిక సమంత, దర్శకుడు గుణశేఖర్ మరియు చిత్ర యూనిట్ తమ సినిమా చుట్టూ సాధ్యమైనంత వరకూ మంచి క్రేజ్‌ను సంపాదించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు, అయితే వారి ప్రమోషనల్ కంటెంట్ వారి ప్రయత్నాలను నీరుగారుస్తుంది.

శాకుంతలం బృందం తమ సినిమాలోని ముఖ్యమైన పాత్రల కోసం ప్రత్యేక పోస్టర్‌లను విడుదల చేసింది, అయితే ఆ పోస్టర్లు సినిమా పై బజ్‌ని చంపేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కట్‌ సినిమా బిజినెస్‌ పై ప్రభావం చూపింది. ఇప్పుడు ఈ పోస్టర్‌లకు కూడా ప్రతికూల స్పందన వచ్చింది.

ఈ రకమైన సినిమాలకు ప్రతి అప్‌డేట్ లేదా ప్రచార కంటెంట్‌ ప్రేక్షకులను ఉత్తేజపరిచెలా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో, ప్రతి చిన్న వివరాలు కూడా సినిమా ఫలితం పై ప్రభావం చూపుతాయి. శాకుంతలం టీమ్ జాగ్రత్త వహించాలి మరియు ఇప్పటి నుండి అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన శాకుంతలం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కాళిదాసు సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందించబడింది. కాగా ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. 3డిలో కూడా విడుదల కానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకం పై గుణ టీమ్‌ వర్క్స్‌తో కలిసి నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ రాజు దుష్యంత మహారాజు పాత్రను పోషిస్తుండగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ప్రిన్స్ భరతగా నటించింది. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధు, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version