Home సినిమా వార్తలు Charan NTR Fans: రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరూ గ్లోబల్ స్టార్ ట్యాగ్ కోసం...

Charan NTR Fans: రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరూ గ్లోబల్ స్టార్ ట్యాగ్ కోసం పోరాడుతున్నారు కానీ నిజానికి ఇద్దరూ అందుకు అర్హులు కారు

ఆర్ఆర్ఆర్ పాశ్చాత్య ప్రేక్షకులకు చేరువై అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ అయినప్పటి నుంచి మెగా, నందమూరి అభిమానులు తమ హీరో మాత్రమే గ్లోబల్ స్టార్ అని, మిగతా హీరో కాదని ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ వాస్తవంలోకి వెళితే హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ప్రస్తుతానికి గ్లోబల్ స్టార్స్ గా చెప్పుకునే అర్హత లేదు.

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వీరిద్దరికి మంచి ఫేమ్ వచ్చిన మాట వాస్తవమే కానీ వారి తదుపరి సినిమాలు ఇంటర్నేషనల్ సినిమాలు కావు కాబట్టి ఆ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా వర్కవుట్ అవుతాయో లేదో వేచి చూడాలి.

ఆ మాటకి వస్తే ఆర్ఆర్ఆర్ సినిమాకి టోటల్ క్రెడిట్, గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఏ రియల్ గ్లోబల్ స్టార్ అనాలి. ఇక మహేష్ తో తన నెక్ట్స్ మూవీని ఆయన ఇంటర్నేషనల్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక నుంచి తన సినిమాలన్నీ ఇంటర్నేషనల్ మూవీస్ గానే తెరకెక్కనున్నాయి.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు పొంది, త్వరగానే ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన తరువాత అందరి చేతా ఈ చిత్రం గుర్తింపబడింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా అవార్డును కూడా గెలుచుకుంది.

అంతే కాకుండా నాటు నాటు పాట ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ పొందింది. రిహన్నా, లేడీ గాగా పాటలతో పాటు ఈ పాట నామినేట్ చేయబడింది. ఆస్కార్ వేదిక పై నాటు నాటు పాటకు లైవ్ పెర్ఫార్మెన్స్ చేయనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version