Homeసినిమా వార్తలుRetro Second Song Shriya Saran Dance Number రెట్రో సెకండ్ సాంగ్ : శ్రేయ డ్యాన్స్...

Retro Second Song Shriya Saran Dance Number రెట్రో సెకండ్ సాంగ్ : శ్రేయ డ్యాన్స్ నంబర్

- Advertisement -

ఇటీవల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ కంగువ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి కెరీర్ పరంగా అతిపెద్ద డిజాస్టర్ అయితే చవి చూశారు సూర్య. ఇక దాని అనంతరం తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా రెట్రో. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన మాస్ యాక్షన్ లవ్ స్టోరీగా రెట్రో డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై సూర్యా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ అందరిలో కూడా బాగా అంచనాలు ఉన్నాయి. 

ఇప్పటికే రిలీజ్ అయిన రెట్రో ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ నుంచి త్వరలో రెండో సాంగ్ రిలీజ్ చేయనున్నారు యూనిట్. కాగా ఈ సాంగ్ లో సూర్య తో కలిసి శ్రియ శరన్ ఒక అద్భుతమైన డాన్స్ నెంబర్ తో కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా ఈ సాంగ్ ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అద్భుతంగా కంపోజ్ చేశారని చెప్తున్నారు. 

ఖచ్చితంగా ఈ సాంగ్ అందరిని రేపు థియేటర్స్ లో కూడా అలరిస్తుందట. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై కార్తేకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్, జ్యోతిక, సూర్య ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ మే 1న రిలీజ్ కానుంది. మరి రిలీజ్ అనంతరం రెట్రో ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

READ  Sankranthiki Vasthunam Sequel Release Fix 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ రిలీజ్ ఫిక్స్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories