Home సినిమా వార్తలు Raviteja Ram Success Test రామ్, రవితేజ ఇద్దరికీ పెద్ద పరీక్షే

Raviteja Ram Success Test రామ్, రవితేజ ఇద్దరికీ పెద్ద పరీక్షే

mr bachan double ismart

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్న స్టార్స్ లో మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో ఉస్తాద్ రామ్ ఇద్దరూ ఉంటారు. నటులుగా ఒక్కో సినిమాతో మరింత పేరు అందుకుంటున్న వీరిద్దరూ మరొక రెండు రోజుల్లో తమ తాజా సినిమాలతో ఆడియన్స్ ముందుకి రానున్నారు.

ముందుగా రామ్ తో పూరి తీసిన డబుల్ ఇస్మార్ట్ గురించి మాట్లాడుకుంటే దీనిని ఛార్మి తో కలిసి పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తూ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇక రవితేజ తో హరీష్ శంకర్ తీస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ రెండు మూవీస్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీస్ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, కెరీర్ పరంగా చూసుకుంటే అటు రామ్, ఇటు రవితేజ ఇద్దరూ కూడా గతకొన్నాళ్ళుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆగష్టు 15న రిలీజ్ కానున్న ఈ మూవీస్ వారికి ఏస్థాయి సక్సెస్ ని అందిస్తాయో, ఈ పరీక్షలో వాళ్ళు ఏస్థాయి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version