Home సినిమా వార్తలు Mr Bachchan Trailer పవర్ఫుల్ మాస్, యాక్షన్ అంశాలతో ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్

Mr Bachchan Trailer పవర్ఫుల్ మాస్, యాక్షన్ అంశాలతో ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్

mr bachchan trailer

మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. కొన్నాళ్లక్రితం హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రెయిడ్ కి ఇది అఫీషియల్ రేమేక్ అనేది తెలిసిందే.

ఇటీవల మిస్టర్ బచ్చన్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని కూడా రవితేజ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ముఖ్యంగా ట్రైలర్ లో రవితేజ మార్క్ స్టైల్, డైలాగ్స్, యాక్షన్ తో పాటు హరీష్ శంకర్ మార్క్ మాస్ కమర్షియల్ అంశాలు అదిరిపోయాయి.

ఒక చక్కటి కథని తీసుకుని దానికి కమర్షియల్ హంగులు జోడించి రీమేక్ చేయడంలో హరీష్ శంకర్ మంచి సిద్దహస్తుడనేది తెలిసిందే. ఇక మొత్తంగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ని బట్టి చూస్తుంటే మూవీలో అన్ని వర్గాల ఆడియన్స్ కి కావలసిన అన్ని అంశాలు సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆగష్టు 15న రిలీజ్ కానున్న ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version