Home సినిమా వార్తలు Viswaksen in Lady Getup సర్ప్రైజింగ్ : లేడీ గెటప్ లో విశ్వక్సేన్

Viswaksen in Lady Getup సర్ప్రైజింగ్ : లేడీ గెటప్ లో విశ్వక్సేన్

viswaksen in lady getup

యువ నటుడు విశ్వక్సేన్ ఇటీవల ఫలక్ నుమా దాస్ మూవీతో నటుడిగా దర్శకుడిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత నుండి నటుడిగా వరుసగా పలు సినిమా అవకాశాలు అందుకుంటూ కొనసాగుతున్న విశ్వక్సేన్, ఇటీవల దాస్ కా ధమ్కీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి డిఫరెంట్ జానర్ సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వంచి మంచి విజయాలు, క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇక తాజాగా సర్ప్రైజింగ్ గా లేడీ గెటప్ లో నటిస్తూ లైలా అనే మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్దమవుతున్నరు విశ్వక్. నేడు గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలు జరుగగా, తాజాగా రిలీజ్ అయిన విశ్వక్ లేడీ గెటప్ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్న లైలా మూవీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా ఆకాంక్ష శర్మ తొలిసారిగా హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి వాసుదేవ మూర్తి కథని అందిస్తుండగా తనిష్క్ బాగ్చి, జీబ్రాన్ సంగీత దర్శకులుగా, రిచర్డ్ ప్రసాద్ ఫోటోగ్రాఫర్ గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version