Home సినిమా వార్తలు Rashmika Mandanna Following Shraddha Kapoor శ్రద్దా బాటలో రష్మిక మందన్న

Rashmika Mandanna Following Shraddha Kapoor శ్రద్దా బాటలో రష్మిక మందన్న

rashmika mandanna

టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ ని సక్సెస్ లని అందుకుంటూ కొనసాగుతున్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న ఒకరు. తొలిసారిగా నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించిన ఛలో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి పేరు అందుకున్న రష్మిక, ఆ తర్వాత పలు విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తతం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఆమె సినిమాలు చేస్తున్నారు.

ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ తో పుష్ప, విజయ్ దేవరకొండ తో గీతా గోవిందం వంటి సినిమాలు తెలుగులో ఆమెకు బాగా పేరు తీసుకువచ్చాయి. ఇక ప్రస్తుతం పుష్ప 2 లో కూడా హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే తాజాగా హిందీలో ఒక హర్రర్ కామెడీ జానర్ మూవీ వ్యాంపైర్డ్ ఆఫ్ ది విజయనగర అనే మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు రష్మిక.

ఈమూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుండగా దీనిని అక్టోబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ నటించిన హర్రర్ కామెడీ మూవీ స్త్రీ 2 హిట్ కావడంతో రష్మిక కూడా బాలీవుడ్ లో అదే జానర్ మూవీతో సక్సెస్ అందుకునేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్తున్నాయి సినీ వర్గాలు. మరి ఈ మూవీతో రష్మిక ఏ స్థాయి విజయం అందుకుంటారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version