Home సినిమా వార్తలు Devara Ready for 150 Crore Opening రూ. 150 కోట్ల ఓపెనింగ్ కి సిద్ధమైన...

Devara Ready for 150 Crore Opening రూ. 150 కోట్ల ఓపెనింగ్ కి సిద్ధమైన ‘దేవర’

devara

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

అనిరుద్ ఈ మూవీకి ఇప్పటికే అందించిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలవగా అతి త్వరలో మూడవ సాంగ్ ని కూడా రిలీజ్ చేసేందుకు సిద్దమయింది టీమ్. ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్ర చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అందరిలో మంచి అంచనాలు కలిగిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27 న ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రీ బుకింగ్స్ అమెరికాలో ఓపెన్ చేయగా అక్కడ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఇప్పటికే అక్కడ 120కె డాలర్స్ ని దేవర కొల్లగొట్టగా ఓపెనింగ్ పరంగా డే 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 70 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశం లేకపోలీదంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇక అటు హిందీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, సహా ఇతర ఇతర ప్రాంతాలు అన్ని కలుపుకుని దేవర పార్ట్ 1 మూవీ డే 1 రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం గట్టిగా కనపడుతోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version