టాలీవుడ్ లెజెండరి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు కెరీర్ పరంగా 100 సినిమాలు పైగా దర్శకత్వం వహించి ఎన్నో సక్సెస్ లతో మంచి పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చివరిగా 2017 లో నాగార్జున కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన సినిమా ఓంనమో వెంకటేశాయ. అయితే అది పెద్దగా సక్సెస్ కాలేదు.
దాని అనంతరం 2021లో శ్రీలీల శ్రీకాంత్ కుమారుడు రోషన్ కలయికలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాకి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. గౌరీ రోనంకి ఆ సినిమాను తెరకెక్కించగా అది పెద్ద విజయం అందుకుంది. ఇక తాజాగా యువ నటీనటులు అర్జున్ కళ్యాణ్, నటాషాల కలయికలో రూపొందుతున్న ఒక సినిమాకి కె రాఘవేంద్రరావు కథతోపాటు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. ఈటివి విన్ సిరీస్ కథాసుధలో భాగంగా ఇది రూపొందింది.
అలానే దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. రాంకీ తెరకెక్కిస్తున్న ఆ సినిమా పేరు ఏవీ అలనాటి ముద్దులు. ఈటీవీ విన్ యాప్ లో నేటి అర్ధరాత్రి నుంచి ప్రసారం కానున్న ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ సినిమాకి వి కిరణ్ కుమార్ సంగీతం అందించగా కృష్ణకాంత్ డైలాగ్స్ రాశారు. మరి రాఘవేంద్రరావు బ్రాండ్ మార్క్ ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఓవరాల్ గా ఏవి అలనాటి ముద్దులు సినిమా ఏ స్థాయిలో ఓటిటిలో ఆడియన్స్ రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.