Home సినిమా వార్తలు Pushpa 2 Trailer Sensation in 24 Hours 24 గంటల్లో ‘పుష్ప 2’ ట్రైలర్...

Pushpa 2 Trailer Sensation in 24 Hours 24 గంటల్లో ‘పుష్ప 2’ ట్రైలర్ సంచలనం

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటెర్టైనర్ మూవీ పుష్ప 2. ఈమూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో దీనిని వై రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పుష్ప నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ తో పాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్స్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా మూవీ నుండి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

నిన్న పాట్నాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో భాగముగా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ ఆశించిన స్థాయిలో అయితే ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ఎక్కువగా మాస్ యాక్షన్ కమర్షియల్ అంశాలు మాత్రమే ట్రైలర్ లో చూపించారు, చాలా వరకు ఈ ట్రైలర్ అందరినీ నిరాశపరిచింది. అయితే విషయం ఏమిటంటే, గడచిన 24 గంటల్లో పుష్ప 2 ట్రైలర్ సంచలన స్థాయిలో యూట్యూబ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

తెలుగులో పుష్ప 2 ట్రైలర్ 44 మిలియన్స్, హిందీ లో 49 మిలియన్స్, తమిళంలో 5 మిలియన్స్ మరియు మళయాళ, కన్నడ ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని మొత్తంగా 24 గంటల్లో 105 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. మొత్తంగా అయితే పెద్దగా రెస్పాన్స్ లేకున్నప్పటికీ పుష్ప 2 ట్రైలర్ కి ఇంత భారీ స్థాయి రెస్పాన్స్ రావడం సంచలనం అని చెప్పాలి. మరి డిసెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version