Home సినిమా వార్తలు Kollywood Biggest Superstar Ilayathalapathy Vijay కోలీవుడ్ తిరుగులేని సూపర్ స్టార్ ఇలయదళపతి విజయ్

Kollywood Biggest Superstar Ilayathalapathy Vijay కోలీవుడ్ తిరుగులేని సూపర్ స్టార్ ఇలయదళపతి విజయ్

vijay

కోలీవుడ్ స్టార్ నటుడు ఇలయదళపతి విజయ్ హీరోగా ఎంతో గొప్ప క్రేజ్ కలిగి ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ లో రిజల్ట్స్ తో సంబంధం లేకుండా విజయ్ మూవీస్ కి భారీ స్థాయిలో కలెక్షన్స్ లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోగా విజయ్ చేస్తున్న మూవీ వస్తుంది అంటే అటు తమిళనాడుతో పాటు కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది.

ఇక తెలుగు, హిందీ, కన్నడలో కూడా తనకు బాగానే క్రేజ్ ఉంది. ఇటీవల విజయ్ హీరోగా తెరకెక్కిన గోట్, బీస్ట్, లియో వంటి మూవీస్ పెద్దగా టాక్ ని అందుకోనప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ ని రాబట్టాయి. ఒకరకంగా ఇది విజయ్ హీరోగా భారీ స్థాయిలో అన్ని వర్గాల్లో సంపాదించుకున్న క్రేజ్ అని చెప్పాలి. ఈ విధంగా ప్రస్తుతం కోలీవుడ్ లో భారీ స్థాయి స్టార్డంతో విజయ్ దూసుకెళ్తున్నారు. ఇక ఆయన అనంతరం సూర్య, విక్రమ్ సహా ఇతర స్టార్స్ మూవీస్ కి నెగటివ్ టాక్ వస్తే కొన్ని చోట్ల మినిమమ్ కలెక్షన్ కూడా రావడం లేదు.

తాజగా సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ అనంతరం తప్పకుండా రూ. 1000 కోట్లని చేరుకుంటుందని నిర్మాతలు ఆశాభవం వ్యక్తం చేసారు. రిలీజ్ రోజు నుండి పెద్దగా టాక్ అందుకోని కంగువ ప్రస్తుతం బాక్సాఫిస్ వద్ద పర్వాలేదనిపించే స్థాయిలో మాత్రమే కలెక్షన్ తో సాగుతోంది. ఈ విధంగా చూస్తే అందరిని మించి భారీ క్రేజ్ సూర్య సొంతం అని అంటున్నాయి కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version