కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా తర్కెక్కిన కొమరం పులి, ఖలేజా సినిమాలను తన కనకరత్న మూవీస్ బ్యానర్ పై శింగనమల రమేష్ నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో మంచి అంచనాలతో భారీ లెవెల్లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. పవన్ కళ్యాణ్ కొమరం పులి మూవీని ఎస్ జె సూర్య తెరకెక్కించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఇక మహేష్ బాబు ఖలేజా మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తరకెక్కించగా మణిశర్మ సంగీతం అందించారు. ఈ రెండు సినిమాలు అప్పట్లో చాలాకాలం పాటు షూటింగ్ జరుపుకొని ఆలస్యంగా రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా ఈ రెండు సినిమాలు విషయమై నిర్మాత శింగనమల రమేష్ బాబు ఒక మీడియా మీట్ లో భాగంగా మాట్లాడుతూ పవన్, మహేష్ ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ అప్పట్లో అటు పవన్ కళ్యాణ్ ఇటు మహేష్ బాబు సినిమాలైన ఖలేజా, కొమరం పులి రెండు కూడా షూటింగ్ కి దాదాపుగా మూడేళ్ళ సమయం పట్టాయని, అదే సమయంలో తనకు రెండిటి మీద కలిపి రూ. 100 కోట్ల దాకా నష్టం వచ్చిందని అన్నారు. అయితే అటు మహేష్ గాని ఇటు పవన్ గాని ఇద్దరూ తనకు ఏమాత్రం సహాయం చేయలేదని చెప్పుకొచ్చారు. మరి ఈ ఘటనపై రాబోయే రోజుల్లో ఆ ఇద్దరు హీరోల నుండి ఎటువంటి స్పందన హీరోల నుంచి వస్తుందో చూడాలి