Home బాక్సాఫీస్ వార్తలు Kalki 25 Days Collection ‘కల్కి 2898 ఏడి’ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్

Kalki 25 Days Collection ‘కల్కి 2898 ఏడి’ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్

kalki

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనెల లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకుంది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీలో భారతీయ దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు చేసారు. ఇక ఈ మూవీ ఇంకా పలు ప్రాంతాల్లో మంచి కెలెక్షన్ తో కొనసాగుతోంది.

నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన కల్కి 2898 ఏడి మూవీ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 25 రోజులు నడిచింది. మరి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమేర కలెక్షన్ రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాలు : రూ. 280 కోట్లు

కర్ణాటక: రూ. 74 కోట్లు

తమిళనాడు: రూ. 44 కోట్లు

కేరళ: రూ. 32 కోట్లు

ఉత్తర భారతదేశం: రూ. 310 కోట్లు

ఓవర్సీస్: $30M [ రూ. 250 కోట్లు ]

ప్రపంచవ్యాప్తంగా మొత్తం: రూ. 990 కోట్లు

మరి మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక మూవీ ఇంకెంత మేర రాబడుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version