Home సినిమా వార్తలు Poonam Kaur Allegations on Trivikram త్రివిక్రమ్ పై సంచలన ఆరోపణలు చేసిన పూనమ్ కౌర్ 

Poonam Kaur Allegations on Trivikram త్రివిక్రమ్ పై సంచలన ఆరోపణలు చేసిన పూనమ్ కౌర్ 

poonam kaur trivikram

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ పరంగా స్వయంవరం మూవీతో టాలీవుడ్ కి కథ, మాటల రచయితగా అడుగుపెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఆ తరువాత పలు సినిమాలకు కథ, మాటలు అందించిన త్రివిక్రమ్, ఆపైన నువ్వే నువ్వే మూవీతో దర్శకడిగా మారారు. 

అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతడుతో బాగా క్రేజ్ అందుకున్న త్రివిక్రమ్, అక్కడి నుండి కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు. తాజాగా జానిమాస్టర్ పై కొనసాగుతున్న రేప్ ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ పై డైరెక్ట్ గా సంచలన ఆరోపణలు చేసారు నటి పూనమ్ కౌర్. 

గతంలో కూడా ఆయన పై ఒకింత పరోక్షంగా పలు విషయాలు ఆరోపించిన పూనమ్, గతంలో త్రివిక్రమ్ పై మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేస్తే వారి నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. ముఖ్యంగా తనకు బెదిరింపు కాల్స్ రావడంతో పాటు టాలీవుడ్ కి చెందిన పెద్దలు ఎవరూ కూడా స్పందించలేదని ఆరోపించారు. కాగా త్రివిక్రమ్ పై డైరెక్ట్ గా ఆరోపణలు చేసిన పూనమ్ మ్యాటర్ పై టాలీవుడ్ లో ప్రకంపనలు రేగుతున్నాయి. మరి ఈ మ్యాటర్ మున్ముందు ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version