Home సినిమా వార్తలు హరి హర వీర మల్లు సినిమా కోసం తీవ్రంగా కష్ట పడుతున్న పవన్ కళ్యాణ్

హరి హర వీర మల్లు సినిమా కోసం తీవ్రంగా కష్ట పడుతున్న పవన్ కళ్యాణ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా హరి హర వీర మల్లును చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పీరియడ్ యాక్షన్ ఎపిక్ తాలూకు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్ జరుగుతోంది.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. కాగా సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం పగలు మరియు రాత్రి నిరంతరం కష్టపడుతోంది. అంతే కాకుండా ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. మరియు షెడ్యూల్‌ను సకాలంలో త్వరితగతిన పూర్తి చేయడానికి ఆయన అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు.

2024 ఎన్నికల నేపథ్యంలో సినిమాలన తగ్గించి రాజకీయాల పై ఎక్కువ సమయం వెచ్చించాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నారట. అందుకే చిత్ర బృందం కూడా హడావుడిగా పని చేస్తూనే తగు జాగర్తలు కూడా తీసుకుంటున్నారు.

రాజకీయ కారణాల వలన ఇక పై పవన్ కళ్యాణ్ మరే కొత్త సినిమానీ అంగీకరించడం లేదు. అందువల్ల హరి హర వీర మల్లును త్వరగా పూర్తి చేసి, ఆ తర్వాత రాజకీయాలకు మాత్రమే సమయం కేటాయించడం పై ఆయన ప్రధాన దృష్టి నెలకొంది.

హరి హర వీర మల్లు నిర్మాతలు ఈ చిత్రాన్ని 2023 వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పిల్లలు మరియు కుటుంబ ప్రేక్షకులు చారిత్రక నేపథ్యం మరియు పీరియాడికల్ సినిమాల పై ఆసక్తిని కనబరుస్తారు కాబట్టి ఈ జానర్ వేసవికి సీజన్ కు సరిగ్గా సరిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ రోజుల్లో ప్రేక్షకులు చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందని మరియు 17వ శతాబ్దపు భారతదేశం లో జరిగిన సంఘటనల పై ఈ చిత్రం కొంత వెలుగునిస్తుందని ఆశిద్దాం. అలా జరిగితే గనక హరి హర వీర మల్లు చిత్రం మరింత మంది ప్రేక్షకులను మరియు ప్రశంసలను పొందటం ఖాయం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version