Home సినిమా వార్తలు సీడెడ్ బిజినెస్ లో బాలయ్యను వెనక్కి నెట్టేసిన చిరంజీవి

సీడెడ్ బిజినెస్ లో బాలయ్యను వెనక్కి నెట్టేసిన చిరంజీవి

2023 సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీనియర్ నటులు సంక్రాంతి సీజన్‌లో ఇంతకు ముందే చాలా సార్లు పోటీ పడ్డారు. తమ అభిమాన హీరోల మధ్య జరిగే ఈ పోటీని చూసేందుకు ఇరు వర్గాల అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే మటుకు వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్య ముందున్నాడు అనే చెప్పాలి. ఈ ఇద్దరు సూపర్‌స్టార్‌లకు బలమైనదిగా చెప్పుకునే సీడెడ్ ప్రాంతంలో బాలయ్య గత చిత్రం అఖండ ఏకంగా 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గతంలో చిరంజీవి నటించిన డజన్ల కొద్దీ సినిమాలు ఇదే ప్రాంతంలో ఘన విజయం సాధించాయి.

ఇక వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డి సినిమాలకు సీడెడ్ లో తాజాగా ఒప్పందాలు జరిగాయి. అందులో మెగాస్టార్ సినిమాకు 16 కోట్లు ఆఫర్ చేయగా, బాలయ్య ఫ్యాక్షన్ సినిమా 12 కోట్ల డీల్ మాత్రమే రాబట్టగలిగింది.

రాయలసీమ/సీడెడ్‌ ప్రాంతం బాలయ్య బలమైన స్థానంగా చెబుతుంటారు. అయినా కూడా వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువ ధరకి కొనుగోలు అవడం చిరంజీవి ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక ముఖ్యమైన అతిథి పాత్ర చేయడం అలాగే చిరంజీవి మునుపటి తరహాలో కామెడీ మరియు మాస్ లుక్ వంటి అంశాలు కలగలిపి ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉండటం బిజినెస్ బాగా జరగడానికి సహాయ పడ్డాయి అని చెప్పవచ్చు.

మొత్తంగా చిరు డామినేషన్‌ ఉన్నప్పటికీ బాలయ్య సినిమాను కూడా కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపుతున్నారు. అందుకే సగటు బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ధరలు భారీగా పెరుగుతున్నాయి.

సంక్రాంతి పండగ ప్రయోజనం అనేది కొనుగోలుదారులు తమ పెట్టుబడులను తిరిగి పొందడంలో సహాయపడవచ్చు. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయని మరియు డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లను సంతోషపెట్టాలని ఆశిద్దాం. ఎందుకంటే వారు దసరా నుండి నీరసమైన దశను చూస్తున్నారు కదా.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version