Home సమీక్షలు Pattudala Review Boring and Disappointing Movie ‘పట్టుదల’ రివ్యూ : బోరింగ్ గా సాగే...

Pattudala Review Boring and Disappointing Movie ‘పట్టుదల’ రివ్యూ : బోరింగ్ గా సాగే సాగతీత డ్రామా 

pattudala review

కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ హీరోగా యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడాముయార్చి. వాస్తవానికి ప్రారంభం నాటి నుండి అందరిలో ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అర్జున్ సర్జా, రెజీనా ప్రధాన కీలక పాత్రల్లో కనిపించగా అనిరుద్ సంగీతం సమకూర్చారు. సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. కాగా ఈ మూవీని తెలుగులో పట్టుదల టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 

సినిమా పేరు: విడాముయార్చి
రేటింగ్: 2.25 / 5
తారాగణం: అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా తదితరులు
దర్శకుడు: మగిళ్ తిరుమేణి
నిర్మాత: లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 6 ఫిబ్రవరి 2025

కథ : 

ముఖ్యంగా ఈ మూవీ కథ అర్జున్, కాయల్ అనే ఇద్దరు జంట మధ్య ప్రధానంగా సాగుతుంది. 12 ఏళ్ళు కలిసి జీవించిన అనంతరం వారిద్దరూ ఒకరి నుండి మరొకరు విడిపోవాలని భావిస్తారు. అయితే చివరిసారిగా కాయల్ ని ఆమె తల్లితండ్రుల వద్దకు తీసుకెళ్లాలని భావిస్తాడు అర్జున్. ఇద్దరూ కలిసి ఆమె తల్లితండ్రుల వద్దకు రోడ్డు మార్గాన వెళ్లే క్రమంలో అనుకోకుండా కాయల్ మిస్ అవడం, అనంతరం కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవ్వడం జరుగుతుంది. కాగా పలు ట్విస్టులు, మలుపుల అనంతరం ఆమె చివరికి అర్జున్ వద్దకు చేరిందా లేదా అనేది మిగతా కథ

నటీనటుల పెర్ఫార్మన్స్ : 

ముఖ్యంగా ఎప్పటివలే అర్జున్ పాత్రలో మరొక్కసారి అజిత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. పలు యాక్షన్, ఎమోషన్ సీన్స్ లో ఆయన మరింతగా ఆకట్టుకున్నారు. ఇక వయసు పెరుగుతున్నప్పటికీ కూడా వన్నె తగ్గని అందంతో అలానే ఆకట్టుకునే నటనతో త్రిష ఈ మూవీలో కాయల్ పాత్రలో మరింత మెప్పించారు. ఇది రెగ్యులర్ మాస్ కమర్షియల్ మూవీ కానప్పటికీ తమ పాత్రల యొక్క పరిధి మేరకు మిగతా నటులు కూడా ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ : 

కాగా ఈ మూవీని హాలీవుడ్ హిట్ మూవీ అయిన బ్రేక్ డౌన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రూపొందించారు. ఇది రోడ్ ట్రిప్ థ్రిల్లర్ కావడంతో కొన్ని చోట్ల పలు విదేశీ భాషలు ఉంటాయి. వాస్తవానికి ఇటువంటి కథలని ఆడియన్స్ కి చేరువ చేసే విధానం బాగుంటే ఖచ్చితంగా మూవీ సక్సెస్ అవుతుంది. అయితే ఆ విషయమై దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ చాలా స్లో గా ఉంటుంది, ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ బెటర్ అంతే.

సెకండ్ హాఫ్ కూడా స్లో గా సాగినా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే బెటర్. ఇక విలన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అలానే హీరో ఫ్లాష్ బ్యాక్ అంతగా ఇంట్రస్టింగ్ గా అనిపించవు. క్లైమాక్స్ బాగున్నప్పటికీ సూపర్ అని చెప్పలేం, మొత్తంగా ఓకె ఓకె అనిపిస్తుంది అంతే. అజిత్ వంటి స్టార్ హీరోకి రాసుకున్న క్యారెక్టరైజెషన్ ఆయన స్టార్డం కి సరిపోదు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బెటర్ అంతే, అద్భుతం కాదు. 

ప్లస్ పాయింట్స్ : 

  • స్టైలిష్ ప్రెజెంటేషన్
  • ఇంటర్వెల్ ఎపిసోడ్
  • సెకండ్ హాఫ్ లో కొన్ని ఎలివేషన్ సీన్స్

మైనస్ పాయింట్స్ : 

  • సాగతీత కథనం
  • హీరో / విలన్ల పాత్రల చిత్రణ బలహీనంగా ఉంది
  • సరైన భావోద్వేగ సంబంధం లేకపోవడం

తీర్పు : 

మొత్తంగా ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన విడాముయార్చి మూవీ బోరింగ్ గా సాగే సాగతీత మూవీ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ తప్ప మూవీ మొత్తంగా డిజప్పాయింట్ చేస్తుంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version