Homeసినిమా వార్తలునిఖిల్ కెరీర్ లోనే బెస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న కార్తికేయ 2

నిఖిల్ కెరీర్ లోనే బెస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న కార్తికేయ 2

- Advertisement -

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించి 2014 లో విడుదలైన సినిమా “కార్తికేయ”. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా చక్కని ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 8 ఏళ్ళ తరువాత అదే హీరో – డైరెక్టర్ కాంబినేషన్ లో కార్తికేయ 2 రాబోతుంది.

ఈ సీక్వెల్ ఉంటుంది అని ప్రకటన రాగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇక ఫస్ట్ లుక్, ఇటీవలే విడుదల అయిన టీజర్ మరియు ట్రైలర్ లతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. మామూలుగానే సీక్వెల్ సినిమాలు అంటే క్రేజ్ బాగా ఉంటుంది అందులోనూ కృష్ణుడు,ద్వారకా నేపథ్యం అవడంతో మనకి తెలియని విషయాలు ఎన్నో సినిమాలో ఉంటాయి అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది.

ఇలా అన్ని వైపులా మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమాకి ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరగనుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 18 కోట్లకు ప్రైమ్ షోస్ సంస్థ దక్కించుకుందట.నిఖిల్ కెరీర్ లోనే ఇది అత్యధిక రికార్డుగా చెప్పుకోవచ్చు.ఇక కార్తికేయ 2 నిజంగానే అంచనాలు అందుకుని సూపర్ హిట్ గా నిలిస్తే నిఖిల్ స్టార్డం ఒక మెట్టు పైకి వెళుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

READ  పక్కా రీజనబుల్ రేట్లు అంటున్న పక్కా కమర్షియల్ టీమ్

ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ కీలకపాత్రలలో నటిస్తుండగా.. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నిఖిల్ తదుపరి రిలీజ్ చేయబోయే 18 పేజెస్ చిత్రంలోనూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్యే నిఖిల్ మరో కొత్త సినిమా “స్పై ” ను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  విక్రమ్ తో రామరాజు ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories