Homeసినిమా వార్తలుNetflix Nacks Hero nani హీరో నానికి నెట్‌ఫ్లిక్స్ పెద్దఎత్తున మద్దతు

Netflix Nacks Hero nani హీరో నానికి నెట్‌ఫ్లిక్స్ పెద్దఎత్తున మద్దతు

- Advertisement -

నాచురల్ స్టార్ నాని ఇటీవల కెరియర్ పరంగా మంచి విజయాలతో కొనసాగుతున్నారు. ఆ విధంగా ఆయా సినిమాలతో నటుడిగా ఆడియన్స్ లో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నారు. దీని అనంతరం ఇప్పటికీ శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ మూవీ కూడా ఆయన అనౌన్స్ చేశారు. 

అయితే పలువురు స్టార్స్ యొక్క సినిమాల థియేటర్స్ వద్ద ఆకట్టుకుంటున్నప్పటికీ ఓటిటి డీల్స్ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో డీల్స్ ని సెట్ చేయలేకపోతున్నాయి. కాగా ప్రముఖ ఓటిటి మద్యం నెట్ ఫ్లిక్స్ మాత్రం వరుసగా నాని సినిమాలను అలానే నిర్మిస్తున్న సినిమాలను కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవల నాని నటించిన శ్యామసింగరాయ్, సరిపోదా శనివారంతో పాటు ఆయన లేటెస్ట్ గా చేస్తున్న హిట్ 3 మరియు ది పారడైజ్ సినిమాల ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ వారే సొంతం చేసుకున్నారు. 

ముఖ్యంగా ప్యారడైజ్ మూవీ భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా సంస్థ పైన నిర్మితమవుతున్న కోర్టు సినిమా యొక్క డిజిటల్ హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ వారే దక్కించుకోవడం విశేషం. చిన్న చిత్రాలు ఇటీవల థియేటర్స్ వద్ద ఆకట్టుకునే స్థాయిలో పెర్ఫాం చేయకపోవడంతో వాటి హక్కులను ఓటిటి వారు మంచి ధరకు దక్కించుకోవడం జరుగుతుంది. 

READ  Thandel OTT Streaming Details 'తండేల్' ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

ఆ విధంగా కోర్టు సినిమా డీల్ కూడా నెట్ ఫిక్స్ వారి ద్వారా బాగానే జరిగినట్టు చెప్తున్నారు. మరోవైపు చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న సినిమా యొక్క హక్కులు కూడా నెట్ ఫ్లిక్స్ వారికే సొంతం కానున్నాయట. ఆ విధంగా పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు హీరో నాని సినిమాలని అలానే ఆయన నిర్మిస్తున్న సినిమాల ఓటిటి రైట్స్ ని కొనుగోలు చేస్తూ ఒకరకంగా ఆయనకు పెద్దఎత్తున మద్దతిస్తున్నారని చెప్పాలి. ,మరోవైపు నాని ఓటిటి సినిమాలు కూడా నెట్ఫిక్స్ లో మంచి రెస్పాన్స్ తో బాగానే బేవర్స్ సొంతం చేసుకుంటున్నాయి

Follow on Google News Follow on Whatsapp

READ  Sankranthiki Vasthunnam OTT Release Details 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటిటి రిలీజ్ డీటెయిల్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories