Home సినిమా వార్తలు NBK-108: ఆ టైటిల్ వద్దు అంటున్న బాలయ్య

NBK-108: ఆ టైటిల్ వద్దు అంటున్న బాలయ్య

Balakrishna Asks Anil Ravipudi To Change The Title Of His Film

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌‌ భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఆ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ ఏ బాలకృష్ణ – అనిల్ రావిపూడి. త్వరలో వీరిద్దరి కలిసి చేస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎఫ్ 3 సినిమా తర్వాత అనిల్ రావిపూడి, తన తదుపరి చేయబోయే చిత్రం బాలయ్యతో చేయబోతున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.

ఇది వరకే ఒకసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సింది. బాలకృష్ణ 100వ సినిమా అనిల్ రావిపూడి చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చినా.. ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ – అనిల్ రావిపూడి చేయబోయే సినిమా కథ తండ్రి కూతుళ్ళ మధ్య ఉండబోతోందని సమాచారం.

బాలకృష్ణ కూతురుగా లేటెస్ట్ క్యూట్ గాళ్ శ్రీ లీల కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమాలో బాలకృష్ణ యాభై ఏళ్ల వయసు గల పెద్ద మనిషి పాత్రలో కనిపిస్తారట. అయితే ఆయన పాత్రకు మంచి హీరోయిజం మరియు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని, అభిమానులను అలరించే విధంగా ఆయన పాత్రను తీర్చిదిద్దుతున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి “బ్రో ఐ డోంట్ కేర్” (Bro I Don’t Care) అనే టైటిల్ ను పెట్టాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావించారట. అయితే ఆ టైటిల్ అంతగా బాగోలేదని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, అలాగే అభిమానులకు నచ్చేలా పక్కా మాస్ సినిమా అనిపించేలా టైటిల్ ఉండాలని రావిపూడికి బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ సినిమా అంటే అటు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పక్కా మాస్ యాక్షన్ సినిమాను ఆశిస్తారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ, యాక్షన్ ను చక్కగా మిళితం చేసి ఆకట్టుకుంటూ ఉంటారు. మరి వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాలో కామెడీకి పెద్ద పీట వేస్తారా లేక యాక్షన్ డామినేట్ చేస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version