ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు…. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. అంతకంటే ముందు అతను తెలుగు సినిమా పరిశ్రమతో పాటు మలయాళ పరిశ్రమలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి.ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చి తనదైన నటన, స్టైల్ మరియు డాన్స్ లతో ప్రాంతాలకు.. భాషలకు అతీతంగా ఇమేజ్ ను, స్టార్డం ను పెంచుకుంటూ వచ్చారు అల్లు అర్జున్.
ఇక గత ఏడాది విడుదలైన “పుష్ప” చిత్రంతో అల్లు అర్జున్ తొలిసారి పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. ఈ సినిమా హిందీ ప్రేక్షకులను విపరీతంగా అలరించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. సామీ సామీ, ఊ అంటావా ఉ ఊ ఊ అంటావా పాటలు సోషల్ మీడియాలో సాధారణ ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల దాకా అత్యంత విశేష స్థాయిలో ఆదరణ పొందాయి.
ఇప్పుడు ప్రేక్షకులు, ట్రేడ్ మరియు ఇండస్ట్రీ వర్గాలు “పుష్ప -2” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇన్ని భారీ అంచనాల మధ్య సినిమా వస్తుండటం వల్ల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.
ఇదిలా ఉంటే… ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలు, అందరి ప్రేక్షకుల దృష్టి దక్షిణ భారతీయ సినిమా పైనే ఉంది. కేవలం తెలుగు సినిమానే కాకుండా ఇప్పుడు పెద్ద హీరోలు చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరూ ద్విభాషా చిత్రాలు, పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
ఈ విషయం పైనే ప్రముఖ వార పత్రిక ‘ఇండియా టు డే’ ఒక కవర్ స్టోరీని ప్రచురించింది. తాజా ఇష్యూ కవర్ పేజీగా అల్లు అర్జున్ స్టిల్ ను ప్రచురించడం విశేషం. తొలి పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’తోనే అల్లు అర్జున్ అపారమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు.
ఆ చిత్రంలోని “తగ్గేదేలే” అనే మ్యానరిజం ఇవాళ ప్రతి ప్రేక్షకుడు అలవాటు చేసుకున్నాడు అంటే అది అతిశయోక్తి కాదు. ఇండియా టుడే పత్రిక బన్నీ కవర్ పేజీగా అల్లు అర్జున్ స్టిల్ ను ప్రచురించడంతో.. ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐకాన్ గా నిలిచారు అని అభిమానగణం తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.ఈ కవర్ పేజీ ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at jobs@tracktollywood.com. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.