Home సినిమా వార్తలు NBK 107: బాలకృష్ణ సినిమాని వదలని కరోనా

NBK 107: బాలకృష్ణ సినిమాని వదలని కరోనా

ఇటీవలే నటుడు నందమూరి బాలకృష్ణ కు కరోనా సోకి..ఆ తరువాత త్వరగానే కోలుకున్న విషయం తెలిసిందే.. కరోనా పాజిటివ్ అయిన విషయం, తిరిగి కోలుకున్న విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆయనకు కరోనా సోకిన వార్త విని అటు చిత్ర బృందం.. ఇటు నందమూరి అభిమానులు ఆందోళన చెందిన మాట వాస్తవమే. అయితే ఆయన తొందరగా కోలుకోవడంతో అందరూ ఆనందించారు.

అయితే ఇప్పుడు NBK 107 చిత్ర యూనిట్ ను మరో సమస్య చుట్టు ముట్టింది.NBK 107 చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ రూపొందిస్తోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంభందించిన చిన్న టీజర్ ను బాలకృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రాయ‌లసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను రూపొందిస్తున్న ఈ సినిమాలో శృతి హాస‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.బాలయ్య ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రానికి అన్న‌గారు అనే టైటిల్ ప‌రిశీన‌లో ఉన్న‌ట్లు వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఇదిలా ఉండగా పైన చెప్పుకున్నట్టు బాలకృష్ణ కు కరోనా సోకి మళ్ళీ కోలుకున్న తరువాత చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది.అయితే ఆరోగ్యం కుదుట పడ్డాక బాలకృష్ణ రెండు రోజుల క్రితమే షూటింగ్ లో తిరిగి పాల్గొన్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా చిత్ర యూనిట్ లో కొంత మందికి కరోనా సోకడంతో మళ్ళీ షూటింగ్ ఆపేసారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మొదట దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కు వాయిదా వేశారు. ఇప్పుడు ఈ కొత్త సమస్య వల్ల చిత్ర బృందం కొన్ని ఇబ్బందులు ఎదురుకోక తప్పదు. అయితే కరోనా తీవ్రత ఇప్పుడు బాగా తగ్గింది కాబట్టి కరోనా సోకిన యూనిట్ సభ్యులు తొందరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version