Home సినిమా వార్తలు నరేష్ – పవిత్ర సంబంధం వ్యవహారంలో మళ్ళీ గందరగోళం

నరేష్ – పవిత్ర సంబంధం వ్యవహారంలో మళ్ళీ గందరగోళం

గత కొద్ది రోజులుగా సీనియర్ నటుడునరేష్, నటి పవిత్ర ల గురించి జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వాళ్లిద్దరూ పెళ్ళి చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ మారింది. అయితే ఈ విషయం పై ఇరువురూ వివరణ ఇస్తూ అదేమీ లేదని కొట్టి పారేసారు

.ఈ నేపథ్యంలో నరేష్ తల్లి విజయ నిర్మల ధరించే డైమండ్ నెక్లెస్ ను పవిత్ర కి పెళ్లి గిఫ్ట్ గా నరేష్ ఇచ్చాడని,అంత కంటే వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని నిరూపించడానికి ఇంకేమి ఆధారాలు కావాలి అని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపణలతో మరోసారి తెరపైకి వచ్చిందీ వ్యవహారం.

తాజాగా బెంగళూరులో ఉన్న నరేష్- పవిత్ర జంటను చూసి కవరేజ్ కి వెళ్లింది మీడియా. దీంతో అలర్ట్‌ అయిన పవిత్ర- నరేష్ లు గట్టిగా కేకలు వేస్తూ ఓ అపార్ట్‌మెంట్ లోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే వున్న మూడో భార్య రమ్య పవ్రితను చెప్పుతో కొట్టడానికి ముందుకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయితే వాళ్లిద్దరు లిప్ట్ లో ఎక్కి కిందకు దిగుతూ మూడో భార్య రమ్య వైపు చూస్తూ నరేష్ విజిల్స్ వేసుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మొత్తం వ్యవహారం అంతా అసలు మాట్లాడు కోవటానికి కూడా వీలు లేనంతగా రోజు రోజుకూ అసహ్యంగా తయారు అవుతుంది.సినిమా పరిశ్రమలోని వారికి ఇలా వ్యక్తిగత జీవితంలోని విషయాలపై సరైన అదుపు లేకుంటే పరిస్తితి ఇలాగే ఉంటుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version